charmi-kaur rejected to give hair and nail samplesడ్రగ్స్ కేసు పుణ్యమా అంటూ దీనిపై ప్రజలలో కూడా బాగా అవగాహన పెరుగుతోంది. తాము ఎంతగానో అభిమానించే సినీ సెలబ్రిటీలు ఇందులో విచారణకు హాజరవుతుండడం, ఏ ఒక్క చిన్న అంశం కూడా వదిలిపెట్టకుండా మీడియా కధనాలను ప్రసారం చేస్తుండడంతో డ్రగ్స్ వినియోగంపై మరియు దానికి సంబంధించిన ఇతర అంశాలపై కనీస సమాచారం ప్రజలకు తెలుస్తోంది. అందులో భాగంగానే ఛార్మి వేసిన పిటిషన్ తర్వాత బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళకు సంబంధించిన అంశాలు హైలైట్ అయ్యాయి.

ముందుగా వచ్చినవారు తామంతట తాముగా ఇస్తే, ఛార్మి మాత్రం బలవంతంగా తీసుకోవడాన్ని విభేదించింది. అంటే ఈ విచారణలో తాను బ్లడ్ శాంపిల్స్ గానీ, వెంట్రుకలు గానీ, గోళ్ళు గానీ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్తోంది. మరి దీనిపై కోర్టు ఏం తీర్పు ఇస్తుందో గానీ, విచారణలో నిజాలు వెలుగు చూడాలంటే ఇవి చాలా కీలకం అని సిట్ అధికారులు భావిస్తున్నారు. నిజానికి బ్లడ్ శాంపిల్స్ కంటే కూడా సేకరించిన వెంట్రుకలు, గోళ్ళు అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంటాయని మీడియా వర్గాల వేదికగా నిపుణులు వ్యక్తపరుస్తున్న మాటలు.

బ్లడ్ శాంపిల్స్ ద్వారా మూడు నెలల లోపు తీసుకున్న డ్రగ్స్ ఒక్కోసారి బయటపడొచ్చు లేకపోవచ్చు గానీ, వెంట్రుకలు, గోళ్ళ ద్వారా మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయనేది నిపుణుల భావన. మరి ఛార్మి వీటినే వ్యతిరేకించడం అంటే… ఎలాంటి సంకేతాలను అభిమానులకు, సిట్ అధికారులకు పంపిస్తున్నట్లు? అలాగే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఇలాంటి ఉదంతాలు తమ పరువు ప్రతిష్టలను భంగపరుస్తాయని చెప్పిన ఛార్మి, మరి వాటి నుండి బయటపడాలంటే… తన నిజాయితీని ఏ విధంగా నిరూపించుకుంటుందో కూడా వివరణ ఇచ్చుకుంటుందా?