charmi-kaur-High Courtబుధవారం నాడు సిట్ ఎదుట విచారణను ఎదుర్కొననున్న హీరోయిన్ ఛార్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చింది. ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఛార్మిని ఎంక్వయిరీ చేస్తున్నామని సిట్ అధికారులు నోటీసులు పంపిన దరిమిలా, ఆమె నుండి ఎలాంటి బలవంతపు బ్లడ్ శాంపిల్స్ తీసుకోరాదని కోర్టు సూచించింది. అలాగే విచారణ సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ అవసరమైతే మరుసటి రోజు మరలా విచారణ చేసుకోవచ్చని తెలిపింది.

ఛార్మి మహిళ గనుక మహిళా అధికారులతోనే విచారణ చేయాలని తెలిపిన కోర్టు, విచారణ స్థలాన్ని ఛార్మి తనకు అనుకూలంగా ఎంచుకోవచ్చని స్పష్టత ఇచ్చారు. అయితే తాను అబ్కారీ ఆఫీసుకే వస్తానని గతంలో స్పష్టం చేసిన ఛార్మి, తాజా పరిణామాలతో మనసు మార్చుకుంటే తప్ప, దాదాపుగా ఎక్సైజ్ ఆఫీసులో విచారణ జరగవచ్చు. తన లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని కోరిన ఛార్మి విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. కేవలం సాక్షిగా మాత్రమే మీ నుండి సమాచారం తీసుకోనున్నారు కాబట్టి న్యాయవాది అవసరం లేదని స్పష్టం చేసింది.

దీంతో ఒంటరిగానే ఛార్మి విచారణను ఎదుర్కోబోతోంది. దీనిపై స్పందించిన ఛార్మి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి… “కోర్టు స్పష్టం చేసింది గనుక ఛార్మి ఇక బ్లడ్ శాంపిల్స్ ఇవ్వదని” కుండబద్దలు కొట్టారు. అయితే నిజంగా తాను ఎలాంటి తప్పు చేయకపోతే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఛార్మికున్న అభ్యంతరం దేనికి? అన్న ప్రశ్న సామాన్యులలో కలుగుతున్నాయి. పూరీ, తరుణ్ ల మాదిరి బ్లడ్ శాంపిల్స్ ఇస్తే తమలోని నిజాయితీ సగర్వంగా చాటిచెప్పుకోవచ్చు కదా! అయితే ఇవేమీ ఛార్మికి తెలియనివి కావు. ఇంతకీ ఛార్మి మదిలో ఏముందో..?!