Change in Andhra Pradesh BJP headఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారనున్నాడా? అంటే అవును అనే వినిపిస్తుంది. ఎన్నికల ఓటమి తరువాత నుండీ నాయకత్వ మార్పు మీద బీజేపీ దృష్టి పెట్టిందట. అయితే తనను అధ్యక్ష పదవిలో కొనసాగించాలని ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిస్తున్నప్పటికీ, ఆ అవకాశం లేదని అంటున్నారు.

అధ్యక్ష పదవికి మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ బీజేపీ నేత పురందేశ్వరి పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు ఆ పార్టీ జాతీయ వర్గాలు తెలిపాయి. ఆమెతోపాటు విశాఖపట్నం ఎమ్మెల్సీ మాధవ్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. కొత్త సారధిపై ఈ నెల 16న స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.

పురందేశ్వరికి కేంద్ర మాజీ మంత్రిగా, ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, వివిధ భాషల్లో అనర్గళం గా మాట్లాడగల నేతగా గుర్తింపు ఉంది. మాధవ్‌ కూడా ఢిల్లీ దృష్టిని ఆకర్షించారని, ఆయనకు నేతల మద్దతు కూడా బాగానే ఉందని సమాచారం. ఇటీవలే వరకూ పురందేశ్వరికి ఆవిడ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండటం ఇబ్బంది గా ఉండేది.

అయితే ఆయన పార్టీ నుండి తప్పుకోవడంతో ఆ అడ్డంకి తప్పినట్టే అంటున్నారు. గత ఎన్నికలలో ఒక్క ఎమ్మెల్యే సీటులో గానీ ఒక ఎంపీ సీటులో గానీ బీజేపీకి ధరావత్తు దక్కకపోవడం విశేషం. దీనితో పార్టీ సారధి ఎవరైనా వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చెయ్యడం కత్తి మీద సామనే చెప్పుకోవాలి.