Chandu Mondeti Next movie with Sharwanandఒక డైరెక్టర్ హిట్ ఇస్తే చాలు…ఫ్యామిలి ఫ్యామిలి మొత్తం ఆ దర్శకుడితోనే సినిమాలు చేసేస్తారు..ఇది కొత్త కదా ఏం కాదు…పాత కధే. ఎందుకంటే మెగా శిబిరం నుంచి ఇటు అక్కినేని శిబిరం వరకు జరిగిదే. అయితే కాసేపు మెగా శిబిరం గురించి కాస్త పక్కన పెట్టి అక్కినేని వారి వద్దకు వెళితే…

చందు మొండేటి…ఈ దర్శకుడు కార్తికేయ సినిమాతో మంచి మంచి హిట్ అందుకోగా, వెంటనే వల వేసి పట్టుకున్న నాగ్ తన కుమారుడు చైతుతో రెండు సినిమాలు చేసేలా ప్లాన్ చేసాడు. అందులో ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ అవగా, మరో పక్క తాజాగా వచ్చిన సవ్య సాచి సినిమా డిజాస్టర్ గా మరి 40 నుంచి 50 % వరకూ నష్టాలనే మిగిల్చింది.

ఇదిలా ఉంటే మరో పక్క ఈ సినిమా ప్లాప్ కాక చందు మొండేటితో నాగ్ సైతం ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి, కానీ ఎప్పుడైతే సవ్యసాచి పోయిందో, వెంటనే చందు ని లైట్ తీసుకున్నారు అక్కినేని ఫామిలీ.

ఇక చందు కూడా వారినే నమ్ముకోకుండా శర్వానంద్ తో సినిమా చెయ్యడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు, ఈ మధ్యనే శర్వాకి కథ కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఆ దర్శకుణ్ణి పక్కకు తప్పించి, మెల్లగా వేరే డైరెక్టర్ పై ఫోకస్ పెట్టారు నాగ్ అండ్ ఫామిలీ అన్న వార్త మాత్రం బలంగా వినిపిస్తుంది.