Chandrabbau Naidu - TTDటీటీడీలో 2014-19 మధ్య నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఇప్పటికే ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఆ ప్రతిపాదన కోర్టులో ఉండగానే… 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించినప్పటికీ దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది.

టీటీడీ పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుబ్రహ్మణ్యం స్వామి స్వాగతించారు. ఎన్నికల ముందు ఒకటి రెండు సంవత్సరాల నుండి సుబ్రహ్మణ్యం స్వామి జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ కోర్టులకు కూడా వెళ్లారు.

ఇప్పుడు కూడా టీటీడీలో 2014-19 అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న కాలం విషయంలోనే కోర్టుకు వెళ్లడం గమనార్హం. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ టీటీడీలో వివాదాలు ఎక్కువ అయ్యాయి. ఏడు కొందరు వేంకటేశ్వరుడివి కావు అన్న చర్చ కూడా మొదలయ్యింది.

ఆ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అలాగే తిరుమల లో కూడా మత మార్పిడులు ఎక్కువయ్యాయని, నిజమైన శ్రీవారి భక్తులు అయితే అప్పటి నుండీ కాగ్ ఆడిట్ అడగాలి… 2014-19 మధ్యలోనే అంటే అది రాజకీయ ప్రేరేపిత చర్య అని అర్ధం అవుతుందని శ్రీవారి భక్తులు అంటున్నారు. అలా చేస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితం అవుతుంది.