Chandrabbau Naidu - Kinjarapu Atchannaiduకోర్టుల నుండి తమకు ఏమైనా వ్యతిరేక తీర్పు వచ్చినా లేక టీడీపీకి ఏదైనా అనుకూలంగా వచ్చినా… వైఎస్సార్ కాంగ్రెస్ వారు చాలా సునాయాసంగా చంద్రబాబు కోర్టులను మ్యానేజ్ చేస్తాడు అని అనేస్తారు. అదే నిజమనుకుంటే చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన అచ్చెన్నాయుడుకు బెయిల్ తెచ్చుకోలేకపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే… మాజీ మంత్రి , టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ న్ హైకోర్టు తోసిపుచ్చింది.అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు తో పాటు ఇతర నిందితులు రమేష్ కుమార్ ,మురళీ, సుబ్బారావుల బెయిల్ పిటిషన్ లను కూడా తిరస్కరించారు.

అయితే అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారని అటువంటి అవకాశమే లేదని కోర్టులలో ఆయన తరపున లాయర్లు వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. నిందితులకు బెయిల్ ఇవ్వడం వల్ల విచారణకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.

తాజా కోర్టు తీర్పుతో ఇప్పుడు అచ్చెన్నాయుడు సుప్రీం కోర్టుని ఆశ్రయించే ప్రయత్నాలలో ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా… వ్యవస్థలను మ్యానేజ్ చెయ్యడం అంత తేలిక కాదని… ఎంతటి వారైనా కోర్టులలో తమ పోరాటాలు తాము చేసుకోవాల్సిందే. తీర్పులు మాత్రం వారి అధీనంలో ఉండవని మరొక సారి తేలిపోయింది.