Narendra-Modi-To-Micromanage-YS-Jaganముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న కలెక్టర్ల సదస్సులో నేడు ఎస్పీల సదస్సులో ప్రసంగించారు. ఈ క్రమంలో జగన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేలు మీ దగ్గరకొస్తే చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించండి. వారిని విశ్వాసంలోకి తీసుకోండి. ప్రభుత్వానికి కలెక్టర్లు ఒక కన్నైతే, ఎమ్మెల్యేలు మరో కన్ను. ఈ రెండు విభాగాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లేస్తే గెలిచినవారే ఎమ్మెల్యేలు. వారు ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకొస్తారు. ఫలానా పనిచేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. వాటిపై సానుకూలంగా స్పందించాలి’’ అంటూ సరదాగా వివరించారు.

అలాగే ఈ రోజు ఎస్పీల సదస్సులో మాట్లాడుతూ… “చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి” అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీ సమీక్షా సమావేశాలలో ఓడిపోయిన నేతలు సరిగ్గా ఇదే విషయం చెప్పారు. పాలనలో పూర్తిగా అధికారుల చేతిలో పెట్టడంతో ఎమ్మెల్యేలు డమ్మి అయిపోయారు.

అన్ని సేవలు ఆన్ లైన్ లో గానీ అధికారులతో గానీ అయిపోతే ఇక మాకు పనేంటి? ఈ అనుభవం నుండి జగన్ నేర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే వివిధ పథకాల కింద వచ్చే సొమ్ము గ్రామా వాలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల చేతికి అందించే ఆలోచన చేస్తున్నారు. దీనితో స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రే స్వయంగా సొమ్ము ఇచ్చినట్టు లబ్ధిదారులు ఫీల్ అయ్యి అధికార పక్షానికి మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారట. అయితే అందులో అవినీతి లేకుండా చెయ్యడం ముఖ్యం.