Nara Chandrababu Naidu
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని చాలా మంది ఒక చండశాసనుడిగా, పని రాక్షసుడిగా చూస్తారు. అధికారంలో ఉన్నంత సేపు అధికారులను, నాయకులను పరుగులు పెట్టించడం తోనే సరిపోతుంది. దానితో ఆయనకు మానవ సంబంధాలు తక్కువ అంటూ ప్రతిపక్ష పార్టీలు తరచు ఆరోపిస్తూ ఉంటాయి. అయితే చంద్రబాబుకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మాత్రం అది తప్పు అని చెబుతారు.

పార్టీ మారిన కడియం శ్రీహరి వంటి వారు కూడా చంద్రబాబు తమ పిల్లల చదువులకు ఎలా సాయం చేశారో చెప్పారు. అలా చాలా మంది చంద్రబాబు తమకు ఎలా సాయం చేశారో చెబుతూ ఉంటారు. అయితే అవి పెద్దగా ప్రాచుర్యం పొందలేదు ఎందుకో. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబులోని ఆ కోణన్ని మరోసారి బయటపెట్టారు.

ఇటీవలే సీతక్క తల్లిగారు అనారోగ్యం పాలయ్యి వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రికి చంద్రబాబు స్వయంగా వెళ్లి డాక్టర్లతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. దానికి సంబంధించిన వీడియో ను సీతక్క ఆమె తల్లిగారు డిశ్చార్జ్ అయ్యాకా తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ వీక్ అయ్యాక సీతక్క కాంగ్రెస్ లో చేరారు. అయినా చంద్రబాబుకు ప్రతి ఏడాది రాఖి కడతారు. మీడియా ముందుకు ఎప్పుడూ చంద్రబాబు గురించి గొప్పగానే చెబుతారు. పార్టీలు మారిన వెంటనే రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, నాయకుడిని తిట్టిపోయడం… పార్టీ నుండి బయటకు వెళ్లిన వారిని ఇతర నాయకులతో తిట్టించడమనే సంస్కృతి సహజమైపోయిన ఈ రోజుల్లో సీతక్క, చంద్రబాబు వంటి వారు అరుదు అనే చెప్పుకోవాలి.