Will-2019-See-The-Return-of-Chandrababu-Naidu-Clout-at-the-Centerకొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ మహేష్ బాబు “భరత్ అనే నేను” సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తన తల్లి నిర్మలాదేవి పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా తన కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రిన్స్ గతంలో వెలిబుచ్చిన విషయమూ విదితమే. అయితే అదే రోజున తాను నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు.

‘భరత్ అనే నేను’ రిలీజ్ కు, చంద్రబాబు దీక్షకు సంబంధం లేదు గానీ, అదే రోజున చంద్రబాబు పుట్టినరోజు. కేంద్ర ప్రభుత్వంలోని మోడీ నిరంకుశాత్వనికి నిదర్శనంగా ఒక రోజు పాటు నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పార్లమెంట్ ను జరగనివ్వలేదని మోడీ దీక్ష చేసారని, అలా జరగకపోవడానికి కారణం మీరేగా అంటూ ఎద్దేవా చేసిన బాబు, రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

సాయంత్రం ఆరు గంటల వరకు ఈ దీక్ష జరగబోతోందని, వచ్చే ఎన్నికలలో ఢిల్లీ గద్దెను శాశించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, 2019లో టిడిపి మద్దతు తెలిపిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, ఇందుకు 25 ఎంపీ స్థానాలు టిడిపి సొంతం కావాలని, అప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ భారతదేశానికి తెలియజేస్తామని పిలుపునిచ్చారు.