Chandrababu- Naidu-YS Jaganచంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 5000 కోట్ల పనులు చేసి వాటి బిల్లులు కేంద్రానికి సమర్పించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చేసే క్రమంలో ఆ బిల్లులను పెండింగ్ లో పెట్టారు. అయితే ఇటీవలే వాటిలో 1850 కోట్లు విడుదలకు కేంద్రం పచ్చ జెండా ఊపిందని వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా ఇప్పుడు ఆగిపోయాయట.

గతంలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం పోలవరం హయాంలో బోలెడన్ని అక్రమాలకు పాల్పడిందని ఆరోపణ. ఇటీవలే రేమండ్ పీటర్ అనే మాజీ అధికారి నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసి అవినీతి జరిగిందంటూ కేంద్రానికి రిపోర్టు ఇచ్చారు. తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

తాజగా జగన్ ప్రభుత్వం పోలవరం అవినీతి పై విజిలెన్స్ విచారణ జరిపిస్తోంది. దాంట్లో పీపీఏ అధికారి కూడా భాగం కావాలని.. ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు ఆ రిపోర్టు వచ్చేవరకూ నిధుల విడుదల నిలిపివేసింది కేంద్రం. దీనితో 1850 కోట్లు ఆగిపోయాయి. ఆ డబ్బులు కావాలంటే చంద్రబాబు ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వాల్సిందే.

విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రైతు బంధు పథకం జరుగుతుండగా, అమ్మ ఓడి కూడా మొదలు పెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలో నిధుల అవసరం చాలా ఉంది. ఈ సమయంలో కేంద్రం డబ్బులు ఆపేయడం జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అయితే ఇది స్వయంకృతాపరాధమే కదా?