Chandrababu Naidu -widow pension scheme-ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్య వితంతు పింఛన్లు 2000 రూపాయిలు చెయ్యాలని నిర్ణయించారు. వచ్చే నెల నుండి ఇవి అమలు లోకి వస్తాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటికి పింఛన్లు 200 మాత్రమే. దీనిని ఐదు రేట్లు ఒకేసారి పెంచారు. 1000 రూపాయిలు ఇస్తున్నారు. అలాగే దివ్యంగులకు, హిజ్రాలకు 1500 పింఛను ఇచ్చారు.

2017 నుండి కిడ్నీ బాధితులకు డయాలిసిస్ కు 2500 పింఛను ఇస్తున్నారు. పెంచిన పింఛన్లు తమను తిరిగి అధికారంలోకి రావడానికి కారణం అవుతాయని టీడీపీ విశ్వస్తుంది. దాదాపుగా 51 లక్షల మంది అన్ని రకాల పింఛన్లు కలిపి లబ్ది పొందుతున్నారు. వీరి ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఎన్నికలకు ముందే వీటిని పెంచెయ్యడంతో ఇంకాస్త ఎక్కువ ప్రకటిస్తాయి ప్రతిపక్ష పార్టీలు.

అయితే ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో ప్రతిపక్షాలు చేసిన ఎక్కువ వాగ్దానాల కన్నా అధికార పార్టీ హామీలనే ప్రజలు విశ్వసించారు. దీనితో తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. హామీ ఇచ్చేసి ఎన్నికలకు వెళ్లకుండా ముందే అమలు చెయ్యడం తో ఆయా వర్గాలలో నమ్మకం కూడా నింపినట్టు అవుతుందని ఆ పార్టీ నమ్మకం. పింఛన్లు టీడీపీ గెలుపుకు సోపానాలు అవుతాయా? చూద్దాం