Chandrababu Naidu welfare schemes2014లో పవర్‌లోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు అభివృద్దికి సంక్షేమానికి సమతుల్యం పాటిస్తున్నారు. ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. వాటిలో చంద్రన్న పెళ్లికానుక ఒకటి. దీనిలో భాగంగా 25 వేల నగదు, రూ.5 వేల విలువైన పట్టు చీర, పట్టు పంచె కానుకగా ఇవ్వనున్నారు.

చంద్రన్న పెళ్లికానుకలో భాగంగా పెళ్లికి మూడు రోజుల ముందే లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. ఐతే ఇప్పుడుపట్టు చీర, పట్టు పంచె కానుక విరమించుకున్నారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారిన నేపథ్యంలో రూ.30 వేలు నగదు ఇవ్వాలని నిర్ణయించారు.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నాసి రకం చీరలు పంపిణీ చెయ్యడం వల్ల గవర్నమెంట్ అభాశుపాలు కావాల్సివచ్చింది. ఈ నిర్ణయంతో అనవసర అవినీతికి విమర్శలకి తావు లేకుండా ఉంటుంది. మొత్తానికి కేసీఆర్ తప్పు నుండి చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్నట్టు ఉన్నారు!