ఇటీవల కాలంలో పొలిటికల్ కౌంటర్స్ చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, వ్యక్తిగతంగా దూషించడం ఎక్కువ కావడం రాజకీయాలను మరింత దిగజారుస్తోంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యక్తిగత విమర్శలకు దూరం అని స్పష్టంగా చెప్పే విధంగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అవును… మహానాడులో భాగంగా ఓ కార్యకర్త ఆవేశంతో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో భాగంగా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురాగా, అక్కడే ఉన్న చంద్రబాబు మరుక్షణం సదరు యువకుడికి సూచనలతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. తమ్ముళ్ళు… ఎంత ఎమోషన్ ఉన్నా, వ్యక్తిగతంగా ముందుకుపోవద్దు, ఒక రాజకీయ పార్టీగా హుందాగా వ్యవహరించాలి, చేసే పనులు చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అంటూ స్పష్టంగా చెప్పారు.
అదే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే క్రమంలో స్వయంగా పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ కార్యకర్త కంటే దారుణమైన పదజాలంలో వ్యాఖ్యానించడం, ఆయన చేసే రాజకీయాలకు అద్దం పడుతోంది. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ కూడా మీడియాని విమర్శించే క్రమంలో ‘బట్టలిప్పి మాట్లాడుకుందాం’ వంటి ఏహ్యమైన పదజాలంతో స్పందించడం పవన్ ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. పార్టీ అధినేతలే దిగజారిపోతే… ఇక కార్యకర్తలు, అభిమానుల గురించి అంతకుమించి ఏం ఆశించగలం?!
ఇది రా సంస్కారం అంటే 👇.యువకుడు ఆవేశంలో ఎదో పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటే తమ్ముడు తప్పు పర్సనల్ విషయాలు వద్దు అని చెప్పడం సంస్కారం అంతే కానీ పెళ్ళాం పెళ్ళాలు అని మతి తప్పి మాట్లాడే వాడు ఒకడు ఇంకోడేమో బట్టలిప్పుకుని మాట్లాడదాం కిందచూసి మాట్లాడదాం అనేవాడు ..వీళ్లా మన నాయకులు ఛీ pic.twitter.com/etfMnH3q34
— NRI TDP Singapore (@NRITdpSG) July 25, 2018