Chandrababu - Naidu warning to bjpగురువారం జరిగిన తెదేపా సమన్వ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి పరోక్ష హెచ్చరిక చేసినట్టుగా కనపడుతుంది. పరిపాలన బాగోలేకపోతే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఉపేక్షించరనడానికి రాజస్థాన్ ఉపఎన్నికలే ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాబట్టే 125ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కేసీఆర్‌తో, ఏపీలో జగన్‌తో లాలూచీ పడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసేందుకే‌ రాష్ట్ర విభజనకు ప్రణాళికలు రచించిందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చెయ్యాలని చూసినా, లాలూచి రాజకీయాలు చేసినా ఏమి జరగబోతుందో చంద్రబాబు బీజేపీ నాయకత్వానికి పరోక్ష హెచ్చరిక చేసినట్టుగా కనపడుతుంది. మరోవైపు కేంద్రం రాష్ట్రాన్ని చాలా చిన్న చూపు చూస్తుందని, ఇలాగైతే ప్రజల్లోకి ఎలా పోతాం అని ఎంపీలు, సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.