Chandrababu Naidu - Unemployment Schemeప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న నిరుద్యోగ భృతి కి బ్రేక్ పడింది. నిరుద్యోగ భృతిపై కేబినెట్‌ సబ్‌కమిటీ చేసిన సిఫారసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నచ్చకపోవడంతో ప్రస్తుతానికి దీనిని ఆపారు. వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న పథకాన్నే ఇక్కడ అమలు చేస్తే ఫెయిల్ అవ్వడం ఖాయం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

విధి విధానాలు రూపొందించేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. ప్రజా సాధికార సర్వే ద్వారా యువత వివరాలు, భూమి, రేషన్‌కార్డులు తదితర కేటగిరీల కింద సమగ్ర సమాచారం సేకరించారు. దీనితో అర్హులను నిర్ణయిస్తారు. అర్హులకే నిరుద్యోగ భృతిని అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

విధి విధానాల అడ్వయిజరీ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా తాను, అమలుకు సీఎస్‌ ఛైర్మన్‌గా ఉంటారు. దాదాపుగా 8-10 లక్షల మంది అర్హులు ఉంటారని అంచనా వీరికి నెలకు 1500 చప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదన. వీరిని వివిధ గవర్నమెంట్ అవసరాలకు వాడుకుని ఆ భృతిని అందచేస్తారు. అలాగే వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతారు.