chandrababu-naidu-tdp-vs-yrscp-jagan-amaravatiచంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004లో వైఎస్ తో, 2019లో జగన్ తో ఘోరమైన పరాజయం చూశారు. అయితే చంద్రబాబుని ఓడించడానికి అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ ఒకే ఆయుద్దని వాడారు. అప్పట్లో వైఎస్ తరచుగా చంద్రబాబు రాష్ట్రానంతా తెచ్చి హైదరాబాద్ లో పెట్టారు అని ఆరోపించే వారు.

అది ఇతర ప్రాంతాల ప్రజల మీద బాగా పని చేసింది. ఇప్పుడు జగన్ కూడా అదే పల్లవి అందుకున్నారు. తన సామాజికవర్గం కోసం, అనుయాయుల కోసం అమరావతి అని ఆరోపించే వారు. దానితో అమరావతి మనది అన్న భావన ప్రజలలో కలగలేదు. ఇది జగన్ గెలుపుకు బాగా దోహదపడింది.

అయితే ఈ రెండు సార్లు ఎక్కడైతే దోచిపెట్టారు అని ఆరోపించారో అక్కడ కూడా చంద్రబాబు ఓడిపోవడం. 2004లో హైదరాబాద్ లో, 2019లో కృష్ణా గుంటూరు జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అమరావతి ప్రజలైతే చంద్రబాబు తనయుడిని సైతం ఓడించారు.

దోచిపెడితే దోచిపెట్టిన చోట కూడా ఓడిపోవడం గమనార్హం. ఇవి రెండూ చంద్రబాబు నాయుడు రాజకీయ కేరీర్ లోనే అతిపెద్ద షాక్లు అనే చెప్పుకోవాలి. ఆ మాట నిన్న ఎర్రబాలెంలో రైతులతో మాట్లాడుతూ చంద్రబాబు కూడా పరోక్షంగా బయటపడ్డారు.