KCR's-Wrong-Steps-in-National-Politicsతెలంగాణ ఎన్నికలలో వేలు పెట్టిన కారణంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తా అని మీడియా ముందే ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్ ను జగన్ వద్దకు పంపి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానం పంపారు కూడా. అయితే చివరి నిముషంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనను అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ రాజేస్తున్నారని గ్రహించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు కేసీఆర్.

తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబు మీద ఒక్క విమర్శ కూడా చెయ్యకపోవడం విశేషం. చంద్రబాబు గురించి అడుగుతారని మీడియా ముందుకు కూడా రాలేదు. సహజంగా ఏదైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయం జరిగితే కేసీఆర్ వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తారు. అయితే ఇంటర్మీడియట్ రగడ జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. ఏపీ ఫలితాల గురించి ప్రశ్నలు ఎదురుకోవాల్సి వస్తుందనే ఆయన రాలేదు.

2014 ఎన్నికల తరువాత ఆయన వచ్చి ప్రెస్ మీట్ లో జగన్ గెలవబోతున్నాడని మీడియా కు చెప్పారు. ఆ తరువాత అది జరగలేదు. అటువంటి పరిస్థితి ఎదురు కాకూడదనే కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. రేపు గనుక చంద్రబాబు ఓడిపోతే సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని తెరాస నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడుని బండ కేసి బాదడం ఖాయమని వారు అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే కేసీఆర్ ఎన్ని రోజులని మీడియా ను తప్పించుకోగలరు?