Why-Chandrababu-Naidu-Chose-Ongole-for-His-Bus-Yatraమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చక్రబంధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక వైపు ప్రభుత్వం, ఒక వైపు ప్రభుత్వాన్ని సమర్ధించే కొందరు ఆయనను కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. పార్టీని పటిష్టం చెయ్యనివ్వకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్‌ని ఎక్కడ పెట్టాలనే విషయంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కారన్నది ఈ పిటిషన్ సారాంశం. ఏపీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనిల్ కుమార్ బోరుగడ్డ ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

అప్పటి ప్రభుత్వం రాజధాని పై ఒక నిర్ణయం తీసుకుని సమయంలో గతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను, రాజధాని ఏర్పాటుపై నియమించిన శివ రామ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా తమకు తమవారికి మేలు కలిగించేలా రాజధాని ని విజయవాడ, గుంటూరుకు రాజధానిని తరలించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్, జస్టిస్ రవీంద్ర భట్ విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రజెంటేషన్ ఆసాంతం విన్న సుప్రీం న్యాయమూర్తులిద్దరు.. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. మరోవైపు రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ని వేసిన సంగతి తెలిసిందే.