With Chandrababu Naidu Back in The Pavilion, Tamil Nadu Back to Businessకరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి మందు అనేదే లేదు. వీలైనంత ఎక్కువగా టెస్టులు చెయ్యడం… పాజిటివ్ వచ్చిన వారిని ట్రీట్ చెయ్యడం… వారిని ఐసోలేట్ చెయ్యడం ఒక్కటే ఈ వ్యాప్తిని అరికట్టడానికి ఉన్న ఏకైక మార్గం. అయితే టెస్టుల విషయంలో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది.

ఆంధ్ర లో దాదాపుగా ఆరు లక్షల టెస్టులు చేస్తే.. తెలంగాణాలో యాభై వేలు కూడా ఇంకా అవ్వలేదు. టెస్టులు చెయ్యడానికి ఉపయోగపడే ట్రూ నాట్ మెషిన్లవల్ల ఈ తేడా వస్తుందని అంటున్నారు. ఒక్కో మెషిన్ 120 టెస్టులు చేస్తుంది. అటువంటి మెషిన్లు ఆంధ్రప్రదేశ్ లో 340 ఉన్నాయట.

అయితే తెలంగాణ వద్ద మాత్రం కేవలం 21 మాత్రమే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఈ మెషిన్లు దొరకడానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే అని చెప్పాలి. ఆయన హయాంలో ఏరపాటైనా మెడ్ టెక్ జోన్ లో ఈ మెషిన్లు తయారు అవుతున్నాయి. జగన్ అధికారంలోకి రాకముందే ఏపీ వద్ద 225 మెషిన్లు ఉన్నాయి.

కరోనా కారణంగా ఇంకో 215 మెషిన్లు ఆర్డర్ పెట్టారు అవి కూడా మెడ్ టెక్ జోన్ లోనే తయారు అవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరోనా పై పోరాటంలో ఎంతో కొంత బెటర్ గా ఉందంటే చంద్రబాబు వల్లే అని చెప్పుకోవాలి. అయితే అధికారపక్షం ఆ విషయం ఒప్పుకోదు కదా