Court rejects chandrababu-- naidu pleaఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీలో ఆసక్తికర చర్చ నడిచింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారానికి చంద్రబాబు వెళ్తే బాగుంటుందని ఒక ఎంపీ సూచించారు. ఆయా రాష్ట్రాల్లో పొత్తులు, పరిణామాలు చూసి ప్రచారారానికి వెళ్లాలని మరో ఎంపీ అభిప్రాయపడ్డారు.

దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. భాజపా ఓటమికి పార్టీలు ప్రచారం చేస్తే కలిసి వెళ్దామని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. జాతీయ పార్టీ నేలతో మంతనాలు జరిపే క్రమంలో ప్రస్తావన తేవాలని కూడా ఆయన నిర్ణయించారు. బీజేపీ అన్ని విధాల ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా రాఫెల్‌ కుంభకోణంపై జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలతో సభ నిర్వహించాలని ఎంపీ రామ్మోహన్‌ అభిప్రాయపడ్డారు

మోదీ ఏమీ అవినీతికి అతీతుడు కాదన్న విషయం రాఫెల్‌తో స్పష్టమైందని, ఈ విషయాన్ని చాటాలని కంభంపాటి పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలలలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి.