Sakshi Spins Chandrababu Naidu Video to Create A Rift in TDPటీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి 120కి పైగా సీట్లు రావడం ఖాయమని, న్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్నాకే… ఈ మాట చెబుతున్నానని సీఎం వారికి చెప్పడం విశేషం. అధినేత ఇంత ధీమాగా చెప్పడంతో అభ్యర్థులు, శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంల మీద కాపలా పెట్టాలని, ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదని వారికి దిశానిర్దేశం చేశారు.

అదే సమయంలో పార్టీ అభ్యర్థులతో డైరెక్టుగా ఒక మీటింగ్ కూడా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఈనెల 22న చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు… 25 మంది లోక్‌సభ అభ్యర్థులను సమావేశానికి రావాలని ఆదేశించారు. పోలింగ్ రోజు నమోదైన పోలింగ్ గురించే తెలిపే ఫామ్‌-17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ పూర్తి డీటెయిల్స్ పార్టీ ఆఫీసుకు పంపాలని ఆదేశించారు. ఈ నెల 22న అభ్యర్థులతో మీటింగ్ అంటే అప్పటికి సరిగ్గా నెల రోజులకు ఫలితాలు విడుదల అవుతాయి.

ఇదే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తన గెలుపు పట్ల ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. మే నెల చివరిలో తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఎలా జరగబోతుంది అనేది ఈ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. మహానాడును తెలుగుదేశం పార్టీ అధికారంలో జరుపుకుంటుందా లేక ప్రతిపక్షంలో జరుపుకుంటుందా అనేది ఆసక్తికరమైన విషయం. ఇప్పటికే ఆ పార్టీ తెలంగాణాలో ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే.