Why-is-YSR-Congress-Rattled-by-Chandrababu-Naidu-Delhi-Tour

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జాతీయ వ్యాప్తంగా తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గావిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబును అసలు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ జగన్ మీడియా విపరీతంగా చేస్తోన్న ప్రచారం తెలిసిందే. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? అంటే మోడీకి పెట్ మీడియాలు కూడా చంద్రబాబు ఇంటర్వ్యూను చేసారంటే… ఇందులో నిజానిజాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గడిచిన అయిదేళ్ళల్లో జాతీయ మీడియా ఎప్పుడూ ఇవ్వనంత ప్రాముఖ్యత ప్రస్తుతం చంద్రబాబుకు ఇస్తోందని చెప్పవచ్చు. మోడీ ప్రధాని అయిన తొలినాళ్ళల్లో ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబుకు నిజంగానే పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు. నేషనల్ పోలిటిక్స్ లో చంద్రబాబు పేరు విస్తృతంగా వినపడుతోంది. ఇంకా చెప్పాలంటే… రాబోయే 12 నెలల్లో దేశంలో ఏం జరుగుతుందో… ఎవరికీ తెలుసంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా మోడీకి మరియు ఆయనకు వత్తాసు పలికే ‘జగన్ అండ్ కో’కు రుచించకపోవచ్చు.

అందుకనే ఢిల్లీలో ఉన్న వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా తమ మీడియాలలో ఒకటికి పది సార్లు ‘గోబెల్స్’ ప్రచారం చేసుకుంటోంది. పైశాచిక ఆనందం ఎలా ఉంటుందో తెలియని వారికి, జగన్ తరపు మీడియాలను చూసి నేర్చుకోవచ్చు. ఓ పక్కన ప్రతి ఛానల్ చంద్రబాబు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నిస్తుండగా… ఏపీ కష్టాలను, మోడీ సర్కార్ ద్రోహాన్ని దేశ వ్యాప్తంగా ఎలుగెత్తి చెప్తోన్న చంద్రబాబుకు సహకారం అందించడం పక్కన పెడితే, తమ రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టే రాజకీయ నాయకులు ఉండడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అనే భావించాలి.