Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ఏడాది నిండింది. అదే సమయంలో టీడీపీ చారిత్రాత్మక ఓటమికి కూడా అంతే సమయం అయినట్టు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు మరింత ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్ట పరిచే దిశగా ఆయన కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లాస్థాయి కమిటీలు ఉండగా, ఇకపై పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఒక జిలాల్లో వున్న లోక్‌సభ నియోజకవర్గ కమిటీలను కలిపి జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటుచేస్తారు. దీనివల్ల కేడర్‌కు, నాయకుల మధ్య అంతరం తగ్గుతుందని, నేతల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అధినాయకత్వం భావిస్తున్నది.

అదే సమయంలో ఈ చర్యతో మరింత మంది నాయకులకు పార్టీలో అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. తద్వారా పార్టీ ఆక్టివ్ గా ఉంటుంది ఆయన ఆలోచన. ఎక్కువ పదవులు ఉన్న చోట యువకులకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ఆయన ఆలోచన.

ఇప్పటికీ ఈ కమిటిల నియామకం పై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారట. మరీ ముఖ్యంగా ఎక్కడైతే పార్టీ నుండి నాయకులు వెళ్ళిపోయారో అక్కడ ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర నుండి ఈ కసరత్తు మొదలు పెట్టారు. ఈ ప్రయత్నం వల్ల స్థానిక ఎన్నికలలో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.