Chandrababu Naidu Narendra Modi Fightingఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగేట్టుగా ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్నికలకు సిద్ధం కావడానికి చంద్రబాబుకు టైమ్ లేకుండా చేసి ఆయనను ఓడించాలనేది మోడీ వ్యూహం. అందులో సఫలం అయ్యారో లేదో తెలియాలంటే మే 23వరకూ వేచి చూడాల్సిందే. అయితే పోలింగ్ పూర్తి అవ్వగానే యువనాయకులు అందరూ హాలిడేలు ప్లాన్ చేసుకుంటే చంద్రబాబు మాత్రం ఢిల్లీ బాట బట్టారు.

ఈవీఎంలు గోల్ మాల్ చేస్తున్నారని దేశాన్ని అలెర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఘోరమైన ఏర్పాట్లతో ఎన్నికల కమిషన్ సమర్ధించుకోలేని పరిస్థితి. 23 ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఆదివారం నాడు. నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాన్ని తట్టి లేపి మీడియా ముందుకు తెచ్చి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికలలో ఇంకా ఆరు విడతల పోలింగ్ మిగిలి ఉంది. ఈ సమయం అంతా మోడీని బద్నామ్ చెయ్యటానికే ఉపయోగిస్తారు చంద్రబాబు.

ఏకై వచ్చిన ఆయన ఇప్పుడు మేకై కూర్చున్నారు. బీజేపీయేతర పార్టీలకు ప్రచారం కూడా చెయ్యబోతున్నారు. ఇప్పటికే జేడీఎస్ కోసం కర్ణాటకలో ప్రచారం చెయ్యడానికి ఒప్పుకున్నారు. రేపు అక్కడ ప్రచారం ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వారి ప్రాభల్యం ఉంటే అక్కడకి వెళ్లి ప్రచారం చేస్తా అని చెప్పుకొస్తున్నారు ఆయన. 2014 ఎన్నికలల ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ప్రతీ సీటూ కీలకమే. ఈ క్రమంలో చంద్రబాబును ఖాళీగా ఉండేలా షెడ్యూల్ రూపొందిచడం తప్పు అయిపోయిందని కమలనాధులు ఖచ్చితంగా అనుకుంటారు.