Chandrababu Naidu Says No Worry With Pawan Kalyanకాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అనే పుకార్లను తోసిపుచ్చారు చంద్రబాబు నాయుడు. “కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం పెద్దగా లేదు. భాజపా అసలే రాదు..ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్లే.. మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి,” అని ఆయన తన మనసులో మాట బయటపెట్టారు.

దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసి దొడ్డిదారిన ప్రవేశించాలని భాజపా ఆలోచిస్తోంది. వారి వ్యామోహం, ధ్యాస అధికారంపైనే తప్ప అభివృద్ధి, పేదరిక నిర్మూలనపై కాదు. ప్రాంతీయ పార్టీల్లో సమర్థులైన నాయకులున్నారు. వారిని ఎవరూ దెబ్బతీయలేరు. అలా చేయాలనుకుంటే వారు బొబ్బిలిపులిగా ఎదురు తిరుగుతారు. కొండవీటి సింహాలై గర్జిస్తారు. కర్ణాటకలో అదే జరిగింది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు జాతి ప్రయోజనాల కోసం ఒకే వేదికపైకి వచ్చాయి,”

దీనిబట్టి చంద్రబాబు మూడవ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తునట్టుగా అనిపిస్తుంది. అయితే చంద్రబాబు అన్నట్టు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా అవి ఢిల్లీలో ప్రభుత్వాన్ని చేయగలవా అనేది అసలు ప్రశ్న. ఒకవేళ చేసినా ప్రాంతీయ పార్టీలలోని నేతలందరూ ప్రధాని అభ్యర్థులే కదా?