Will-2019-See-The-Return-of-Chandrababu-Naidu-Clout-at-the-Centerఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పోరాటంపై తమకు నమ్మకం లేదని, హోదా ఉద్యమాలపై ఆయన ఆంక్షలు పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఉద్యమాలు చేసే వారి మాయలో పడొద్దని అసెంబ్లీలో సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇప్పటికే అన్ని పక్షాల వారు చేసే పోరాటాలకు మద్దత్తు ఇస్తామని అయితే ఏంచేసినా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చెయ్యాలని మాత్రమే చంద్రబాబు చెప్పారు. మరి దీనికి కమ్యూనిస్టుల అభ్యంతరం ఏంటో? చంద్రబాబు పోరాటంపై నమ్మకం లేదన్నారు సరే, అసలు కమ్యూనిస్టుల పోరాటం పై ప్రజలకు నమ్మకం ఉందా?

గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు. అయితే ప్రజల నుండి వారికి మద్దత్తు అందినట్టు ఎక్కడా కనపడింది లేదు కదా? వాళ్ళ పోరాటంతో కేంద్రంలో కదలిక వచ్చినట్టుగా కూడా లేదు. ఈ సమయంలో అన్ని పక్షాలను కలిసిపోరాడితే ఎమన్నా ఉపయోగం ఉండొచ్చు. అంతేగాని భేషజాలకు పోయి ఇలాంటి మాటలు అంటే మొదటికే మోసం జరుగుతుంది.