Chandrababu Naidu social welfare schemesఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ తీరు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తులకు కుదేల్ అవుతుంది ఆ పార్టీ. మొన్న పెంచిన సాంఘిక సంక్షేమ పెన్షన్ల షాక్ నుండి ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు. పెన్షన్లు రేటింపు చెయ్యడంతో 54 లక్షల మంది డైరెక్టుగా లబ్ది పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ లోపే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరిక పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారట. అలాగే ఒక్కొక్కరికి ఒక స్మార్ట్ పోన్ కూడా ఇస్తారట.

మా వల్లే పెన్షన్లు పెంచారని చెప్పుకుంటున్న వైకాపా లీడర్లు తాజాగా ఇవి కూడా మా నవరత్నాలలోవే అంటున్నారు. డ్వాక్రా మహిళలకు ఏదైనా చేస్తామని అని ప్రతీ రాజకీయ పార్టీ చెబుతాది. అంత మాత్రాన అన్ని పార్టీలు మా నుండే కాపీ కొట్టారు అంటే ఎలా? అయినా చెప్పే వాడికంటే చేసే వాడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటాడు. ఒక వేళ ప్రజలకు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేత బాగా పనులు చేయిస్తున్నారని మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టేస్తారేమో! ఈ ప్రచారం చేసుకునే ముందు కొంచెం అలోచించి చేసుకుంటే మంచిది.

డ్వాక్రా మహిళలకు 10000 రూపాయిల ఆర్ధిక సాయం, ఒక స్మార్టు ఫోన్ పథకాన్ని చంద్రబాబు అధికారికంగా ఈ నెల ఇరవైఆరున ప్రకటించవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే రైతులకు కూడా పెట్టుబడి సాయం స్కీం ఏదో రాబోతుందట. తెలంగాణలోని రైతు బంధు మాదిరి కాకుండా కౌలు రైతులకు కూడా మేలు కలిగించేలా చర్యలు చేపడుతున్నారట. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో విధంగా మేలు చెయ్యడం ప్రతిపక్ష పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.