YS Jagan - chandrababu Naidu Vizag airportమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ప్రయత్నించనున్నారు. ఇందులో భాగంగా ఆయన కాసేపటి క్రితం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మూడు రాజధానులు మద్దతు ఇవ్వడం లేదనే నెపంతో ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

టీడీపీ శ్రేణులు కూడా భారీ స్థాయిలో అక్కడకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇది ఇలా ఉండగా… 2017 జనవరి 26న విశాఖ పర్యటనకు నాటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఎయిర్ పోర్టులోనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టునుండే ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించేశారు.

దానికి ప్రతీకారంగానే తాము చంద్రబాబు యాత్రను అడ్డుకున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. అయితే తర్వాతి రోజు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఉండటం.. అంతకుముందే సదస్సును అడ్డుకుంటామని వైసీపీ ప్రకటించడంతో … ఆయన పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

పైగా ఇప్పుడు చంద్రబాబు యాత్రకు పోలీసులు పర్మిషన్ ఉంది. అప్పుడు జగన్‌ను భద్రతా కారణాలతో అడ్డుకుంటే.. ఇప్పుడు రాజకీయ కారణాలతో చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. పులివెందుల ఫ్యాక్షనిజం విశాఖకు తీసుకువస్తున్నారని, టీడీపీ ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్‌ పాదయాత్ర జరిగేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.