chandrababu naidu shared picture on twitter on completing 27 yearsచంద్రబాబు నాయుడు తొలిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 1995, సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నేటికీ 27 పూర్తయిన సందర్భంగా ఆనాటి ఫోటోను చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఆనాడు నందమూరి తారకరామారావు పాలన ఏవిదంగా సాగింది తర్వాత చంద్రబాబు నాయుడు హయంలో ఏవిదంగా సాగింది.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏవిదంగా సాగుతోందో తెలియజేశారు.

ఇవి టిడిపి పోస్ట్ చేసినందున ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపించినా దానిలో పేర్కొన్నవన్నీ రాష్ట్ర ప్రజలు తమ కళ్ళతో స్వయంగా చూశారు. చూస్తూనే ఉన్నారు. ముగ్గురి పాలనలో తేడా ఏమిటో చూద్దాం.

1983, జనవరి 9వ తేదీ నుంచి ఎన్టీఆర్‌ పాలన ప్రారంభం అయ్యింది. అప్పుడే ఆయన అనేక సంక్షేమ పధకాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల జీవితాలలో మార్పు, బడుగు బలహీనవర్గాలకు సమాన అవకాశాలు, మహిళలకు సమాన హక్కులు పొందారు. తెలుగుజాతి ఆత్మగౌరవం ఇనుమడించింది.

1995, సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రారంభమైంది. ఆయన కూడా సంక్షేమ పధకాలు కొనసాగిస్తూనే అభివృద్ధి, సంస్కరణలకు నాంది పలికారు. ముఖ్యంగా లక్షలాదిమందికి ఉద్యోగాలు వచ్చేందుకు ఐ‌టి రంగాన్ని అభివృద్ధి చేశారు. తద్వారా సామాన్య కుటుంబాలకు చెందిన ఎన్నో లక్షలమంది జీవితాలలో ఉన్నతస్థాయికి ఎదిగి స్థిరపడ్డారు.

2019, మే 30వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన ప్రారంభం అయ్యింది. ఉండవల్లిలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రజావేదికను కూల్చడంతో ప్రారంభించి, అన్నా క్యాంటీన్‌లు మూసివేత, అమరావతి నిర్మాణాలు నిలిపివేత, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయలేక చేతులు ఎత్తేయడం, కరెంట్ కోతలు, వాతలు, మూతపడిన, తరలిపోతున్న పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, అప్పులు, ప్రభుత్వం చేతిలో మోసపోతున్న ప్రభుత్వోద్యోగులు, ఎక్కడ చూసినా అరాచకాలతో వినాశనం జరుగుతోంది. మరో రెండేళ్ళవరకు ఇదే కొనసాగుతుంది.