Chandrababu naidu reviews on his deafeatఎందుకు ఓడిపోయానో అర్ధం కావడం లేదని చెబుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఏమి కోల్పోయానో ఇప్పుడు అర్దం అయిందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ పాటు రాష్ట్రం కోసం పరితపించి పార్టీని పట్టించుకోలేదని ఆయన అన్నారు. పాలనపై దృష్టి పెట్టి క్యాడర్ కు దూరం అయ్యానని ఆయన అన్నారు. ఇప్పుడు వారందరితో మాట్లాడాక ఏం కోల్పోయానో అర్థమైందని ఆయన పార్టీ క్యాడర్ కు చెప్పుకొచ్చారు.

పార్టీ కోసం చేయాల్సిన పనులు సకాలంలో చేయలేదని తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల సమీక్ష ద్వారా అర్థమైందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇకపై సంస్థాగత ఎన్నికలతో పార్టీని బలోపేతం చేస్తాం. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వంపై ఎక్కువ దృష్టిపెట్టి పార్టీకోసం సమయం కేటాయించకపోవడం వల్ల టికెట్ల కేటాయింపుల్లో కొన్ని పొరపాట్లు దొర్లాయి.అని ఆయన ఒప్పుకున్నారు. కాకపోతే చంద్రబాబు తెలుసుకునే నాటికి ప్రతిపక్షంలోకి వచ్చేశారు.

అధికారంలో ఉండగా ఇదే విషయాన్నీ ఎందరు ఎన్ని సార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. బలమైన క్యాడర్ ఉన్న పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ లో విఫలం కావడం పార్టీ ఓటమికి అతిపెద్ద కారణం. ఇప్పటికైనా చంద్రబాబుకు ఆ విషయం నిజంగా అర్ధమైతే మంచిదే. కాకపోతే ఆ తప్పు సరిదిద్దుకోవడం కూడా అంత తేలికైన పనేమీ కాదు. చూడాలి ఏం జరగబోతుందో! ప్రస్తుతం చంద్రబాబు ప్రతీ జిల్లాకు తిరిగి పార్టీ పరిస్థితిపై సమీక్షలు జరుపుతున్నారు.