Chandrababu Naidu responded om Lakshmis NTRచంద్రబాబు నాయుడును విలన్ గా చూపిస్తూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన నాటి నుండి ఆయన చనిపోయే వరకు జరిగిన పరిణామాలపై ఈ సినిమా. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కోర్టు కేసులలో కూడా ఇరుక్కుంది. దీనిపై మొదటిసారిగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అయితే అది కూడా ఎప్పటిలా డైరెక్టుగా కాకుండా ఇండైరెక్టుగానే.

మార్చి నెల మొదటి వారంలో రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై అటు సినీ రంగంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా అత్యంత ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని, వారికి ఎన్టీఆర్‌ చరిత్రపై అవగాహన పెంచాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై, రాంగోపాల్ వర్మపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ కారణజన్ముడు అని, సినిమా, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను తెలుగుజాతి మరువదు అని కీర్తించారు. అదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ సినిమా పై స్పందించాల్సిన అవసరం లేదని వారికి మార్గనిర్దేశం చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఈ సినిమా విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటాదో లేదో కూడా చూడాలి. దీనిపై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.