chandrababu-naidu-reduces-pension-age-for-scheduled-tribesఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రజలకు పోటా పోటీగా తాయిలాలు ప్రకటిస్తున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశమైతే కొన్ని ఇప్పటికే చేసి చూపిస్తుంది. ఈ తరుణంలో తాజాగా అన్ని సామాజిక పెన్షన్లు డబల్ చెయ్యడంతో ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తాజాగా సామాజిక భద్రత కింద గిరిజనులకు ఇచ్చే వృద్ధాప్య పింఛన్ల వయో పరిమితిని 65 నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఆదివారం విడుదల చేసింది.

వయో పరిమితిని తగ్గించడం ద్వారా కనీసం లక్ష మంది గిరిజనులు లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎంపీడీవోల నుంచి అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. అయితే దీని పై వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. గతంలో నవరత్నాలలో భాగంగా జగన్ అన్ని పెన్షన్లకు వయో పరిమితిని 65 ఏళ్లకు తగ్గిస్తాం అని ప్రకటించారు. అప్పుడు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. 45 ఏళ్లకు పెన్షన్ ఏంటి? అని టీడీపీ నాయకులు విమర్శించారు.

అయితే ఇప్పుడు తమ పథకాన్నే కాపీ కొట్టి స్వల్ప మార్పులు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఎద్దేవా చేస్తున్నారు. అయితే వారు ఇక్కడ ఒక్క చిన్న లాజిక్ మిస్ అయ్యారు. చంద్రబాబు వయోపరిమితి తగ్గించింది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న గిరిజనులకు. వారు జీవితంలో ఎదగడానికి అన్ని రకాలుగానూ ఇబ్బందులే… పైగా చాలా చోట్ల వారికి కనీస వసతులు లేవు. ఈ క్రమంలో వారికి ఈ వెసులుబాటు ఇవ్వడం అందరికీ 45 ఏళ్ల కే పెన్షన్ ఇవ్వడం రెండూ ఒకటి కానే కాదు. మంచి పనిని కూడా విమర్శిస్తే ఎలా?