Chandrababu - Naidu Real Time Governance helps Odishaఫొని తుఫాను సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీజీఎస్‌ సేవలకు పొరుగు రాష్ట్రం ఒడిశా కృతజ్ఞతలు తెలిపింది. “మీరందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. అద్భుత సమచారం అందించారు. మీ అంచనాలే నిజమయ్యాయి. ఫణి సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి” అని ఆర్టీజీఎస్‌కు ఒడిసా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆర్టీజీఎస్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడిందని రైల్వేశాఖ కూడా అభినందించింది. సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది.

అయితే ఈ వార్త సోషల్ మీడియాలోని వైఎస్సార్ కాంగ్రెస్, తెరాస అభిమానులకు రుచించలేదు. ఆర్టీజీఎస్‌ అనేది చంద్రబాబు నిర్మించిన వ్యవస్థ. ఇప్పటికే విపత్తులను కంట్రోల్ చెయ్యడంలో ఆయనది అందే వేసిన చెయ్యి. దీనితో ఒడిశా ప్రభుత్వం అసలు ఆర్టీజీఎస్‌ ను అసలు మెచ్చుకోలేదని, తుఫానులతో తరచుగా అతలాకుతం అయ్యే ఒడిశా ఇటువంటి పరిస్థితిని ఎదురుకోవడానికి ఆర్టీజీఎస్‌ కంటే మెరుగైన వ్యవస్థ ఉందని. కాకపోతే నవీన్ పట్నాయక్ కు చంద్రబాబు లాగ ప్రచార పిచ్చి లేదని చెప్పుకుంటూ వస్తున్నారు.

చంద్రబాబుని తక్కువ చెయ్యడానికి నవీన్ పట్నాయక్ ను నాయకుడిని చేసేస్తున్నారు టీడీపీని వ్యతిరేకించే వారు. మరోవైపు ఫొని తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తక్కువగానే ఉంది. శ్రీకాకుళంలో కొంత మేర ఉంది. తుపానుకు ఒడిశాలోని పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కటక్‌, గంజాం, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో పాక్షిక ప్రభావం కనిపించింది. భువనేశ్వర్‌ స్మార్ట్‌సిటీ కూడా దెబ్బతింది. పూరీ రైల్వేస్టేషన్‌కు భారీ నష్టం వాటిల్లింది. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ కొంత ప్రాంతం పాడయింది.