Chandrababu Naidu preparing for Elections 2019వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2018లో పరీక్షల సీజన్ ముగిశాక స్థానిక ఎన్నికల నిర్వహణ చేపట్టవచ్చని చెబుతున్నారు. అప్పుడు నిర్వహిస్తే ఇప్పటికే అధ్వాన్న స్థితిలో ఉన్న వైకాపా అసలు పోటీ ఇవ్వలేదని, అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేనకు ప్రభావం చూపే అవకాశం ఉండదు.

ఇక కాంగ్రెస్, బీజేపీ సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. 2014లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఫలితాలు మాత్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెల్లడిచారు. అయితే అది అసెంబ్లీ ఎన్నికల ముందు గనుక కోర్ట్ ఫలితాలను ఆపింది.

ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు గనుక ఆ ఫలితాలు వస్తే టీడీపీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేది. స్థానిక ఎన్నికలలో గెలిస్తే దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని,తద్వారా అప్పుడు కూడా విజయం సాధించవచ్చని వ్యూహం వేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేస్తే వివిధ కోర్ట్ కేసుల ద్వారా వాటిని ఎలాగైనా నిలువరించే ప్రయత్నం ప్రతిపక్షం చేయబోతుంది. స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వమని చంద్రబాబు ఇప్పటికే శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేసారు. 2014 కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలి చంద్రబాబు ప్రయత్నం.