Chandrababu Naidu - Pawan Kalyan-సినీ నటి మాధవీ లత పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన ఒక పోస్టు వైరల్ కావడంతో దాని గురించి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దేశసమగ్రత కు భంగం కలిగించి, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించే అటువంటి పోస్టును పదే పదే ప్రసారం చెయ్యడం ఏంటి అంటూ జనసేన అభ్యంతరం తెలుపుతూ టీవీ9కు బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనితో జనసైనికులు ట్విట్టర్ లో #ShamelessTV9 అంటూ ట్రెండ్ చేశారు.

సరిగ్గా చంద్రబాబు హయాంలో ఇటువంటి ఘటనే జరిగింది. శ్రీరెడ్డి లైవ్ లో పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టడంతో రేటింగ్స్ కోసం ఆరులుచాచే మీడియా ఛానళ్ళు ఆ క్లిప్ ను పదే పదే ప్రసారం చేసింది. అందులో టీవీ9 ప్రధానమైంది. దానితో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీనే తనను తిట్టించింది అంటూ పవన్ అప్పట్లో హల్ చల్ చేశారు.

వరుస ట్వీట్లతో టీడీపీ వ్యతిరేక ఫీలింగ్ ని యువతలో పెంపొందించారు. మాకు సంబంధం లేదు అని టీడీపీ వారు చెప్పినా వినలేదు. టీవీ9 తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి… తెరాస జగన్ కు మద్దతు ఇస్తున్న అపవాదు మాత్రం చంద్రబాబు మీదే వేశారు పవన్. ఇప్పుడు చంద్రబాబుకు అధికారం లేదు. టీవీ9ని కేసీఆర్ అనుయాయుడు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కూడా చంద్రబాబునే పవన్ నిందిస్తారా? తాజాగా జనసేన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మాత్రం ఎవరూ చేయించినట్టుగా ఆరోపించలేదు. అసలు విషయానికి వస్తే టీవీ ఛానళ్ళు ఏది ప్రసారం చేసినా దానిని ఎవరో ఒకరు చేయించనక్కరలేదు. రేటింగులు వేటలో ఇటువంటి పనులు మన ఛానళ్ళకు సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే సదరు మాధవీ లత గత ఎన్నికలలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడం.