Chandrababu Naidu Out From Cash for Voteఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేద్దామన్న ప్రతిపక్షాల కుట్రలు బ్రేక్ అయ్యాయి. ఈ కేసులో బాబును దోషిగా నిలబెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో… మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ద్వారా హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయించిన విషయం తెలిసిందే. వైసీపీ తరపున ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయవాదిగా వ్యవహరించడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత లభించగా, తాజాగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పు వైసీపీ ఆశలు గల్లంతయ్యాయి.

ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తుతో తాము ఏకీభవిస్తున్నామని… ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ…. స్క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఓటుకు నోటు కేసు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట పడినట్లయ్యింది. చంద్రబాబు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం… ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ తాజా తీర్పుతో రాజకీయంగా మరోసారి వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

ఒక రకంగా చూస్తే… తెలుగుదేశం పార్టీకి మంచి చేసినట్లయ్యింది. కోర్టు ద్వారానే చంద్రబాబుకు ప్రమేయం లేదని చెప్పించినట్లయ్యింది. తాజా పరిణామాలు వైసీపీ అధినేత రాజకీయ అవగాహనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ఇలాంటి అనుభవరాహిత్యపు రాజకీయాలే పార్టీ కొంప ముంచుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు లాజిక్ లతో మ్యాజిక్ చేసే ఉండవల్లి దూకుడుకు కూడా హైకోర్ట్ బ్రేక్ వేసినట్లయ్యింది.