Chandrababu Naidu on Polavaram Project Fact Fileపోలవరం ప్రాజెక్టుకు సంబందించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ తలపెట్టిన నాటినుండి ఇంతవరకు రాష్ట్రం 12567 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేంద్రం నుంచి 4329 కోట్ల రూపాయలే ఇచ్చినట్టు ఆయన సభకు తెలిపారు.

తాజా లెక్కల ప్రకారం మొత్తం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి 58391 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనాలు సవరించి కేంద్రానికి పంపించామని ఆయన ప్రకటించారు. దీనిలో సింహభాగం నిర్వాసితుల పనుల కోసమే. అదే రకంగా పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌, స్పిల్‌వే పనులు 72శాతం, డయా ఫ్రం వాల్‌ పనులు 47.99శాతం, మట్టి పనులు 72 శాతం పూర్తయ్యాయి.

రేడియల్‌ గేట్లు వంద శాతం పూర్తయ్యాయని ఆయన వివరించారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపి రామచంద్ర రావు వేసిన ప్రజాహిత వ్యాజ్యం స్వీకరించిన హైదరాబాద్ హైకోర్ట్ తన వైఖరి చెప్పాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఆ కేసు విచారణ వచ్ఛే నెల 7న జరగనుంది