Chandrababu -Naidu Odarpu- Yatra to ysrcp attacked victimsఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తెలుగుదేశంలో ప్రక్షాళన మొదలైంది.. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు వినూత్న వ్యూహాలతో అధినేత ముందుకు సాగుతున్నారు.. ఇందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ వారి దాడులలో ఎన్నికల అనంతరం మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు స్వయంగా పరామర్శిస్తున్నారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చెయ్యడానికి త్రిసభ్య కమిటీలు తెరపైకి తెచ్చారు చంద్రబాబు.

జిల్లాలకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆయా కమిటీల్లో సామాజిక సమతుల్యత పాటించి పార్టీకి దూరమైన వర్గాలను మెప్పించడం ద్వారా పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నారు. వారు నియోజకవర్గాలలో నాయకత్వ సమస్య లేకుండా జాగ్రత్త పడతారు. ఎక్కడైనా వలసల వల్ల ఇబ్బంది ఉంటే అక్కడ కొత్త నాయకత్వాన్ని తెర మీదకు తెస్తారు.

ఇటీవలే ఎన్నికలలో ఘోరపరాజయంతో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న సీనియర్లలో 50 – 60 శాతం వైదొలిగి కొత్త రక్తం ఎక్కించాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. గుంటూరు రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా 2024 ఎన్నికల్లో బరిలోకి దిగే నేతలకు ఇప్పటి నుంచే శిక్షణ ఇచ్చే దిశగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న స్థానిక ఎన్నికలలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాబడితే పార్టీకి పూర్వవైభవం తేవడం కష్టమేమీ కాదని చంద్రబాబు ఆలోచనట. ఓటమి నుండి బయటపడి వెంటనే భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యడం, ప్రణాళికలు రచించి అమలు చెయ్యడం ఏదైతే ఉందొ అదే మిగిలిన పార్టీలకు టీడీపీకు తేడా.