chandrababu-naidu-ntr-trust-helped-farmer-nageswara-raoచిత్తూరు జిల్లా మహల్ రాజుపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుమార్తెల సాయంతో పొలం దున్నిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ కావడంతో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ప్రముఖ నటుడు సోనూసూద్ ఆయనకు అప్పటికప్పుడు ఒక కొత్త ట్రాక్టర్ పంపించి అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు.

అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రైతు కుమార్తెలకు విద్యకు సహకరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత హాస్టల్ సదుపాయంతో కూడిన అడ్మిషన్ లెటర్‌ను పంపించింది. నాగేశ్వరరావు కుమార్తెలు వెన్నెల, చందనలను చంద్రబాబు ఆదేశాల మేరకు చదివించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చింది.

ట్రస్ట్‌కు చెందిన మహిళా కాలేజ్‌లో వెన్నెల, చందనలకు ఉచిత హాస్టల్ సదుపాయంతో కూడిన అడ్మిషన్ ఇస్తున్నట్లు తండ్రి నాగేశ్వరరావుకు ఎన్టీఆర్ ట్రస్ట్ లేఖ పంపించింది. ఒకవేళ సొంతూరులోని కాలేజ్‌లోనే చదివించాలనుకుంటే అవసరమైన ఆర్థిక సాయం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని లేఖలో ట్రస్ట్ పేర్కొంది.

“జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇటువంటి సమస్యలు ఏమొచ్చినా తాము అధికారంలోకి వచ్చాకా చేస్తాం అని వారి కర్మకు వదిలేసేవారు. అయితే చంద్రబాబు అలా కాదు అని మరో సారి ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్పాడంటే… చేస్తాడంతే… అనేదానికి చంద్రబాబే నిజంగా అర్హుడు,” అంటూ తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

chandrababu-naidu-ntr-trust-helped-farmer-nageswara-rao