Go Back Modiప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు గుంటూరు పర్యటన సంధర్భంగా నిరసనలు మినంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం గో బ్యాక్ మోడీ అంటూ నినదిస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలకాల్సి ఉండగా, చంద్రబాబు తాను గానీ తన కేబినెట్ మంత్రులను గానీ పంపకూడదని నిర్ణయించుకున్నారు. ప్రధానిని గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికే అవకాశం ఉంది. అలాగే ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులెవరూ హాజరుకావటం లేదు.

ఈ పర్యటనలో మోదీ రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయమే ఈ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఓఎన్‌జీసీ నుంచి అందింది. దీనితో ఏం చెయ్యాలా అనే దాని పై అభిప్రాయాలు తెలుసుకునేందుకు చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అయితే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఓ వైపు నిరసనలు తెలుపుతూ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. నల్లచొక్కాలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది కూడా వద్దనుకున్నారు. దీనితో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు లేకుండానే ఈ కార్యక్రమాలు జరప తలపెట్టారు. మరోవైపు ట్విట్టర్ లో #గోబ్యాక్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.