Chandrababu Naidu No to Pawan- Kalyanఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఇటీవల చోటుచేసుకున్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు నా మనసును పట్టి కుదిపేశాయి. నెలల తరబడి ఉపాధికి దూరమై కష్టాల పాలై ఉసురు తీసుకొంటున్నారు. లక్షల మంది కార్మికుల కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా మనమంతా కలిసి సంఘటితంగా పోరాడాలి. అసమగ్రమైన ఇసుక విధానం వల్ల బాధితులుగా మిగిలిన ఆ కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలి అని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఇప్పటికే బీజేపీ., వామపక్షాలు స్పందించాయి. మిగిలిన పార్టీలు సైతం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై పోరాడేందుకు ముందుకు రావాలి, విశాఖపట్నంలో నవంబర్ 3 వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెలపాలి అంటూ పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.

బీజేపీ, వామపక్షాలు కాకుండా ఇక మిగిలింది కాంగ్రెస్, టిడిపి నే కదా. కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ పార్టీ మద్దతు అడిగినా పెద్దగా ఉపయోగం లేదు అంటే టీడీపీ మద్దతునే పవన్ కళ్యాణ్ కోరారని అర్ధం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ అభ్యర్ధన పై టీడీపీ అంతర్గతంగా చర్చినట్టుగా కనిపిస్తుంది. డైరెక్టుగా మద్దతు అడగనందున తాము ముందుకు వెళ్ళకూడదని నిర్ణయించునట్టు సమాచారం.

పైగా జనసేన పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమానికి హాజరై ఆ పార్టీని పెద్దది చెయ్యడం కూడా రాజకీయంగా నష్టమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. దానికి తోడు ఇప్పటికీ జనసేన తమను, అధికార పార్టీని ఒకే గాటన కట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని టీడీపీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది.