Gali Janardhana Reddy దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మైనింగ్ మాఫియా గాలి జనార్ధనరెడ్డి మధ్య ఉన్న సంబంధం అందరికి తెలిసిందే. ఒకరితరఫున ఒకరు వకాల్తా తీసుకుని చంద్రబాబుని అప్పట్లో వారు టార్గెట్ చేసిన సంగతీ అందరికి విదితమే. అయితే గాలి జైలుకు వెళ్ళాక జగన్ ఆయన నుండి దూరంగా జరిగే ప్రయత్నం చేసారు.

ఆయనతో నాకేం సంబంధం అని మీడియాతో అన్నారు కూడా ఒక సంధర్భంలో. ఇప్పుడు ఆ పార్టీ వారు ఏకంగా గాలిని చంద్రబాబుకు సంబంధం కలిపే పనిలో ఉన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో మైనింగ్ యజమాని ,వివాదాస్ప గాలి జనార్దనరెడ్డిని కలిశారు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె.పార్దసారధి ఆరోపించారు.

గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి మొట్టమొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబేనని పార్థసారధి గుర్తుచేశారు. జనార్దన్‌రెడ్డిని చంద్రబాబు సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇటీవలే కూడా చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తే గాలి, వైకాపా అనుకూలంగా పని చేశారు. ఇలాంటి ఆరోపణలు జనాలు విశ్వసిస్తారా?