Coming-Back-in-2019-With-Better-Results---Naiduవచ్చే ఎన్నికలలో చంద్రబాబు నుండి అధికారం దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోన్న బిజెపి – వైసీపీ – జనసేనలపై లాజికల్ విమర్శలతో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి వర్యులు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా, ఏ మాత్రం సహకరించని బిజెపి అమరావతి బాండ్లపై మాట్లాడే కనీస అర్హత లేదని తేల్చిచెప్పారు.

తెలంగాణాకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం, ఏపీకి సంబంధించిన బిల్లులను మాత్రం పెండింగ్ లో ఉంచి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో జనసేన జనాలను రెచ్చగొడుతోందని, ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇక అసెంబ్లీకి రాకుండా కాలయాపన పనులు చేస్తోన్న వైసీపీ నేతలు, ప్రతి నేలా జీతాలు మాత్రం ఎందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించారు చంద్రబాబు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ఆసక్తి లేని వాళ్ళకి ప్రజాధనం మాత్రం కావాల్సి వచ్చిందా? అన్న ముఖ్యమంత్రి, ప్రతి ఏడాది రెండెంకల అభివృద్ధి సాధిస్తోంది ఒక్క ఏపీ మాత్రమేనని అన్నారు.