Chandrababu-Naidu---KCR-Politicsజనతాదళ్‌ (ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యి తన ఫెడరల్ ఫ్రంట్ గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతు పలకాలని కోరారు. జేడీఎస్‌ నేతలు ఆహ్వానిస్తే తాను కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీని జనతా దళ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చెయ్యనప్పటికీ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో విస్తృతంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చంద్రబాబు కూడా దీనిపై నోరు విప్పుతారేమో చూడాలి. ఒకవేళ చంద్రబాబు కూడా గళం విప్పితే కాంగ్రెస్ కు సమర్ధించినట్టుగా ఉండొచ్చని ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. చంద్రబాబు, కేసీఆర్ సైతం రంగంలోకి దిగితే అక్కడ తెలుగు వారు ఎటువైపు మొగ్గు చూపుతారా అనేది చూడాలి మరి.