YSRCP in Kuppam - Underestimate Chandrababu Naiduవిజయవాడలో ముదురుతున్న రాజకీయ వివాదంపై చంద్రబాబు నాయుడు మొత్తానికి దృష్టి సారించారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల మీరా వచ్చి కలవాల్సిందిగా ఇద్దరు నేతలకు చంద్రబాబు వర్తమానం పంపారు. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని, వెంకన్నతో పలుమార్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు.

వారితో మాట్లాడాకా… ఎంపీ నానితో కూడా చంద్రబాబు సమావేశం అవ్వనున్నట్టు తెలుస్తుంది. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ నేతలు అంతర్గత విభేదాలతో రచ్చకెక్కి మాటల యుద్ధానికి దిగి పార్టీకి నష్టం చేస్తుండడంతో మొత్తానికి చంద్రబాబు వారి మీద దృష్టి సారించారు. వచ్చే నెలలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ కి ఎక్కువగా అవకాశం ఉన్న కార్పొరేషన్ విజయవాడ.

అయితే అంతర్గత కుమ్ములాటల కారణంగా అది చేజారే ప్రమాదం ఉండటంతో చంద్రబాబే రంగంలోకి దిగారు. జయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థి విషయంలో నాని ఒకరిని ప్రతిపాదిస్తుండగా… బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు ఇంకో అభ్యర్థిని బలపరుస్తున్నారు. అక్కడి నుండి వివాదం మొదలయ్యింది.

మరోవైపు… చంద్రబాబు రంగంలోకి దిగడంతో ఈ వివాదం పరిష్కారం అవుతుందని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. విజయవాడలో గనుక ఓడిపోతే… టీడీపీ పూర్తిగా బలహీనపడింది అని ప్రత్యర్ధులు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే సమయంలో అమరావతికి కూత వేటులో ఉన్న విజయవాడలో కూడా టీడీపీ ప్రభావం లేకపోతే అది అమరావతి అంశానికి కూడా నష్టమే.