chandrababu naidu in pushpa movieసిల్వర్ స్క్రీన్ పైన కాస్తో కూస్తో సందడి చేస్తున్న సమయంలోనే ఓటీటీలో ప్రత్యక్షం అయిన “పుష్ప” క్రేజీ మూవీగా మారిపోయింది. వెండితెరపై మిస్ అయిన వారు ఓటీటీలో ‘పుష్ప’ను వీక్షించి తమ భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి చిన్న డీటెయిల్ ని గమనించడం వీక్షకుల వంతవుతోంది.

అందులో భాగంగా “పుష్ప”లో నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారంటూ వెలుగులోకి వచ్చింది. కాలానుగుణంగా పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రుల ఫోటోలను అప్ డేట్ చేస్తుంటారు. “పుష్ప” కధ జరిగే సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విభజన కానటువంటి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తున్న విషయం తెలిసిందే.

దర్శకుడిగా సుకుమార్ పనితీరుకు ఈ ఫోటో అద్దం పడుతుందని పేర్కొనవచ్చు. చిన్న చిన్న విషయాలలో కూడా సుక్కు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారో అనే దానికి సూచిక ఈ చంద్రబాబు నాయుడు పిక్. 1995 నుండి 2004 వరకు ఏకధాటిగా 8 ఏళ్ళకు పైగా ఏపీని పరిపాలించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కింది.

అంతేకాదు ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఆపడానికి నాడు సీఎంగా ఉన్న సమయంలో, అలాగే విభజన జరిగిన తర్వాత 2014లోనూ అనేక చర్యలను చంద్రబాబు నాయుడు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కాలంలోనే కొంతమందినైనా ప్రభుత్వం అరెస్ట్ చేసి స్మగ్లింగ్ ను నియంత్రించగలిగింది. 2014లో చంద్రబాబు నియమించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను నేటి జగన్ సర్కార్ రద్దు చేసింది.