chandrababu-naidu-ntr-trust-helped-farmer-nageswara-raoభారత దేశ రాజకీయ చరిత్రలో మేటి పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు అని చాలా మంది అంటుంటారు. అయితే ఆయన ప్రస్తుతం అధికారం కోల్పోయి ఎన్నడూ లేనంతటి ఓటమిని ఎదురుకుని ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా ఆయన చరిష్మా ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. ఐఐటీ బొంబాయి నిర్వహిస్తున్న గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ కు ఆయనను గెస్ట్ గా ఆహ్వానించారు.

సహజంగా అధికారంలో ఉన్న నాయకులనే ఇటువంటి సదస్సులకు పిలుస్తారు అయితే ఓడిపోయినా చంద్రబాబుని పిలవడం ఆయన కెపాసిటీకి నిదర్శనం. నాయకత్వ లక్షణాల గురించి… ఆధునిక టెక్నాలజీ… రాజకీయాలలోకి యువత రావాల్సిన ఆవశ్యకత వంటి అంశాల గురించి చంద్రబాబు అనర్గళంగా మాట్లాడారు.

టెక్నాలజీ గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలకు సమకాలీన రాజకీయ నాయకులు ఇటువంటి విషయాలు తెలిసిన రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉంటారా అనిపించకమానదు. ఇకపోతే తన ఎన్నికల ఓటమి గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు.

“హైదరాబాద్ వైపు వెళ్ళినప్పుడు చూస్తుంటే…చేసినవన్ని గుర్తొస్తాయ్…బహుశా నేను చేసింది ప్రజలకి గుర్తుండకపోవచ్చు…కానీ దానివల్ల ఉపయోగం…ప్రజల అభివృద్ధి జరిగింది… ఒక జనరేషన్ స్థితి గతులు మార్చగలిగా…నాకు అదే చాలు” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.