Chandrababu Naidu SAnd Mafiaఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనికి 100 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంతో ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసాయి. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో వచ్చిన తప్పుడు తీర్పు అని అప్పట్లో టీడీపీ అభిప్రాయపడింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు అడ్డుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని ఏపీ తరపున న్యాయవాదులు వాదించారు. ఏపీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రెండు వారాల్లో ఎన్జీటీని మళ్లీ ఆశ్రయించాలని రాష్ట్రప్రభుత్వానికి కోర్టు సూచించింది.

మూడు నెలల్లోపు కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ తీర్పు పట్ల ప్రభుత్వం, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో ఇచ్చిన తీర్పు అని తాము ముందే చెప్పామని ఇప్పుడు అదే నిజమైందని వారు అంటున్నారు. చంద్రబాబును అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు మోడీ అమిత్ షా చెయ్యని ప్రయత్నం లేదని, అందులో ఇది కూడా ఒక్కటని, అయితే టీడీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరని వారు అంటున్నారు.