chandrababu naidu got invitation to speak at unoఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఆహ్వానం అందింది. ‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో సెప్టెంబర్ 24వ తేదీన న్యూయార్క్‌లో జరగనున్న సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. 2024 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన ఐరాస ప్రశంసించింది. ఈ విషయంలో తాను కూడా సాయం అందించేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయ రంగంలో చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించిన ఐరాస ఈ మేరకు ఆహ్వానించింది.