Chandrababu Naidu - Gautam Sawangఆంధ్రప్రదేశ్ లో వరుసగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులలో కుట్ర కోణం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా పోలీసుల కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదు అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి హితవు పలికారు.

పోలీసులకు తమ కర్తవ్యమే తప్ప కులం, మతంతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పోలీసులపై గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పడం గమనార్హం. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2019 ఫిబ్రవరిలో అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి మరీ పోలీసులకు కులం ఆపాదించారు.

ఎన్నికలలో పోలీసు యంత్రాంగాన్ని డబ్బు పంపిణీకి వాడుకోవడానికి చంద్రబాబు సామాజికవర్గం కు చెందిన 35మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్ చేశారని అప్పట్లో జగన్ ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశారు. అయితే జగన్ ఇచ్చిన లిస్టు తప్పని ఆ లిస్ట్ లో కేవలం ముగ్గురు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం వారని ఆ తరువాత తేలిపోయింది.

సరే అందులో తప్పు ఒప్పుల సంగతి ఏమైనా… పోలీసులకు కులం, మతం పూయడం మొదటిసారి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని పలువురు పోలీస్ బాస్ మీదే పంచ్లు వేస్తున్నారు. ఆయన పక్షపాత వైఖరి వల్లే జగన్ చేసినవి కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.